in

nidhi aggarwal: no rush for movies and marriage

సినిమా అవకాశాల కోసం తాను ఎప్పుడూ తొందరపడనని..జీవితంలో సినిమాలైనా, పెళ్లయినా దేనికీ హడావుడి పడేది లేదని నటి నిధి అగర్వాల్ స్పష్టం చేసింది. మంచి కథలు, అర్థవంతమైన పాత్రల కోసమే తాను వేచి చూస్తున్నానని తెలిపింది. ‘ఈశ్వరన్’, ‘భూమి’, ‘కళగ తలైవన్’ చిత్రాల తర్వాత తమిళంలో మళ్లీ నటించకపోవడానికి సరైన ప్రాజెక్ట్ రాకపోవడమే కారణమని చెప్పింది. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయడానికి తమిళ చిత్రసీమ సరైన వేదిక అని వ్యాఖ్యానించింది..

పవన్‌ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ వంటి భారీ చిత్రాల్లో నటించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు నిధి తెలిపింది. ప్రస్తుతం తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే తమిళ సినిమాలకు కాస్త దూరమయ్యానని పేర్కొంది. వృత్తిపరంగా తాను ఎంతో కష్టపడతానని, అయితే మిగతా విషయాల్లో చాలా సోమరినని సరదాగా వ్యాఖ్యానించింది. అలాగే తనది చాలా సున్నితమైన మనస్తత్వమని, అందుకే భావోద్వేగాలను బయటకు చూపించనని తెలిపింది..!!

Rakul Preet Did Her First Film Just To Buy A Car!

A STORY BEHIND THE TITLE ‘adithya 369’!