in

Rakul Preet Did Her First Film Just To Buy A Car!

టీవల జరిగిన ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న రకుల్..తాను కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అనుకోకుండా అవకాశం వచ్చిందని తెలిపారు. తన ఛాయాచిత్రాలను చూసిన కొందరు ప్రతినిధులు తన తండ్రిని సంప్రదించి, సినిమాలో నటించమని కోరారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనకు సినిమాలపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ, వారు రూ.5 లక్షల పారితోషికం ఆఫర్ చేయడంతో వెంటనే అంగీకరించానని చెప్పారు..

ఆ డబ్బుతో కారు కొనుగోలు చేసి, తన స్నేహితుల బృందంలో సొంతంగా కారు కొన్న మొదటి అమ్మాయిగా నిలవాలనేదే తన అప్పటి ఏకైక ఆశయమని రకుల్ చిరునవ్వుతో తెలిపారు. ఆ సినిమా కోసం సుమారు 40 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నానని, ఆ సమయంలో కెమెరా ముందు నటించడం తనకు ఎంతో నచ్చిందని వివరించారు. అయితే, ముందుగా తన డిగ్రీ పూర్తి చేయాలని నిశ్చయించుకుని, ఆ తర్వాతే పూర్తిస్థాయిలో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించానని ఆమె పేర్కొన్నారు. ఎటువంటి  గాడ్‌ఫాదర్ లేకుండా 2013లో తిరిగి వచ్చి, ఇక్కడి పరిస్థితులను స్వయంగా నేర్చుకున్నానని స్పష్టం చేశారు. ప్రారంభ దశలో చదువు కారణంగా కొన్ని భారీ ప్రాజెక్టులను కూడా వదులుకోవాల్సి వచ్చిందని రకుల్ తెలిపారు..!!

happy birthday sai kumar!

nidhi aggarwal: no rush for movies and marriage