in

Nagarjuna criticized Tollywood’s culture of release date postponements!

ఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చాలా కాలంగా సినీ ప్రియులు, పరిశ్రమ వర్గాలు చర్చిస్తున్న ‘విడుదల తేదీల మార్పు’ అంశంపై ఆయన చాలా స్పష్టంగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా విడుదల తేదీలను ముందుగా ప్రకటించి, ఆ తర్వాత ఎందుకు వాయిదా వేయాల్సి వస్తుందంటూ నాగార్జున పరిశ్రమను ప్రశ్నించారు..

ఈ సందర్భంగా హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. “క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ డేట్‌ను సరిగ్గా ఒక సంవత్సరం ముందే ప్రకటించారు. మనం ఎందుకు మన చిత్రాల విడుదల తేదీలను అంత ముందే ప్రకటించలేకపోతున్నాం? ఒకవేళ ప్రకటించినా చివరకు దాన్ని వాయిదా వేస్తున్నాం. నేను కూడా ‘లెనిన్’ సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఎందుకంటే అనుకున్న సమయానికి టెక్నికల్ వర్క్ పూర్తి కాలేదు” అని నాగార్జున నిజాయితీగా అంగీకరించారు..!!

Aishwarya Rajesh to play antagonist in Balakrishna’s next!