in

Rashmika joining ram charan, sukumar’s RC17?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రం RC17 పై సినీ వర్గాల్లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ఫ్రాంచైజీ సినిమాలు చరిత్ర సృష్టించడం నేపథ్యంలో..ఈ కొత్త ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి..

ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదట కియారా అద్వానీ పేరు వినిపించినా, తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు బలంగా వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సిరీస్‌తో రష్మిక పాన్-ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఆ చిత్రంలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ కోసం సుకుమార్ ఒక బలమైన, కథను మలుపు తిప్పే మహిళా పాత్రను రాసుకున్నారని, ఆ పాత్రకు రష్మిక అయితేనే పూర్తి న్యాయం చేయగలదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆమెకున్న పాన్-ఇండియా ఇమేజ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం అంచనా వేస్తోంది..!!

senior hero mohan babu trying his luck yet again!

Aishwarya Rajesh to play antagonist in Balakrishna’s next!