in

raashi khanna sustained minor injuries while performing action scenes!

బిజీ కథానాయిక రాశి ఖన్నా షూటింగ్ సెట్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ కంటే తమిళ్, హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో అనీస్ బజ్మీ తెరకెక్కిస్తున్న ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రాశి ఖన్నాకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు దెబ్బలు తగిలినప్పటికీ, రాశి ఖన్నా ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. తన వల్ల షూటింగ్‌కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో గాయంతోనే ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఒక ఫీమేల్ యాక్టరై ఉండి కూడా డూప్ లేకుండా క్లిష్టమైన స్టంట్స్ చేయడం, గాయపడినా వెనకడుగు వేయకపోవడంతో ఆమె అంకితభావాన్ని చూసి నెటిజన్లు, అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు..!!

Pooja Hegde reveals the best quality of bollywood top star!

Sreeleela misses out on yet another biggie!