in

Samantha teams up with Sony LIV Tamil for new project!

మాఇంటి బంగారం’తో టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన స్టార్ హీరోయిన్ సమంత, తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి, తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా నిలిచింది. ఈ ఘనవిజయం తర్వాత సమంత, ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీ లీవ్ తమిళ’ (Sony LIV Tamil) తో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం జతకడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ కొత్త భాగస్వామ్యం గురించి సోనీ లీవ్ తమిళ తన సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేస్తూ, “మేము ఏదో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాం, దాని వివరాలను త్వరలోనే మీతో పంచుకుంటాం” అని పేర్కొంది. దీనిపై సమంత స్పందిస్తూ, “ఈ ఏడాది మార్పులను స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం , కొత్త ప్రారంభాలను ఆహ్వానించడం నేర్పింది. సోనీ లీవ్ తమిళతో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఒక టాక్ షోనా లేక మరేదైనా వెబ్ సిరీసా అనే విషయాన్ని చిత్రబృందం ఇంకా గోప్యంగా ఉంచింది..!!

Sreeleela & Ibrahim Ali Khan’s Diler Eyes Diwali 2026 Release

Sreeleela & Ibrahim Ali Khan’s Diler Eyes Diwali 2026 Release

f cube ‘Kiara Advani’!