in

Sreeleela Bollywood debut with saif ali khan’s son ibrahim!

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ప్రస్తుతం తీవ్ర కన్ఫ్యూజన్‌లో పడింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రావాల్సిన సినిమా కార్తీక్ వరుస ఫ్లాపులు , ‘సయ్యారా’ సినిమా తెచ్చిన కంపారిజన్ భయాల వల్ల జూలై 2026 అవుతున్నా ఇంకా వాయిదా పడుతూనే ఉంది. ఈ ఆలస్యం భరించలేక శ్రీలీల ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ‘దిలేర్’ సినిమాతో హిందీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్..

మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం శ్రీలీలకు పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కార్తీక్ ఆర్యన్‌కు మార్కెట్, స్టార్ ఇమేజ్ ఉన్నాయి. కానీ ఇబ్రహీం అలీ ఖాన్‌కు అస్సలు థియేట్రికల్ మార్కెట్ లేదు, పైగా అతని గత రెండు ఓటీటీ సినిమాలు ఘోరంగా ట్రోల్ అయ్యాయి. స్టార్ హీరోతో లేట్ అయినా క్రేజీ లాంచ్ బెటరా, లేక బజ్ లేని హీరోతో స్పీడ్‌గా ఎంట్రీ ఇవ్వడం బెటరా అనే డైలామాలో శ్రీలీల చిక్కుకుంది..!!

Regina Cassandra onboard for lokesh Kanagaraj’s production!