in

mummy film actor Arnold Vosloo for vijay d’s ranabaali!

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ది మమ్మీ’లో ఇమ్హోటెప్ అనే పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ. ఆయన ఇప్పుడు ఇండియన్ సినిమాలోకి అడుగుపెడుతున్నాడు. అది కూడా టాలీవుడ్ సినిమాతో ఆయన ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పీరియాడిక్ చిత్రంలో ఆర్నాల్డ్ వోస్లూ ‘సర్ థియోడర్ హెక్టర్’ అనే క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్‌లో ఆయన క్యారెక్టర్‌ను ‘ది డెమోన్ ఆఫ్ డ్రాట్’గా అభివర్ణించారు. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది..!!

another nickname of mahanati savitri!

f cube ‘Bhagyashri Borse’!