
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. తేజ్ హీరోగా ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా రెడీ అవుతోంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈలోగా మరో సినిమాకు పచ్చ జెండా ఊపాడు. సేవ్ ద టైగర్స్ ఫేమ్ తేజ కాకమాను దర్శకత్వంలో, ఏకేఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరో. ఇటీవలే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ చిత్రంలో హీరోయిన్ గా సప్తమి గౌడని ఎంచుకొన్నారు. సప్తమికి ఇది రెండో తెలుగు సినిమా. ఇది వరకు ‘తమ్ముడు’ చిత్రంలో కథానాయికగా నటించింది. ఆ తరవాత ఓ తెలుగు సినిమా ఒప్పుకోవడం ఇదే తొలిసారి..!!
