in

trisha shocks chiranjeevi Vishwambhara makers!

త్రిష కృష్ణన్..వయసుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనతో నేటికీ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఆమె ఎంచుకుంటున్న కథలు, నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధిస్తుండటంతో కోలీవుడ్, టాలీవుడ్‌లలో త్రిష క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని ఆకాశాన్నంతగా పెంచేసినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి గుసగుసలు వినిపిస్తున్నాయి..ఇటీవల కాలం వరకు ఒక్కో సినిమాకు రూ.5-6 కోట్ల వరకు తీసుకున్న త్రిష..

ఇప్పుడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.12-15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య సరసన ఆమె నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఒక పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా, ఈ భారీ మొత్తాన్ని కోరినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ కోసం కేవలం రూ.6 కోట్లకు లోపే తీసుకున్న త్రిష, ఇప్పుడు ఒక్కసారిగా రేటు రెట్టింపు చేయడంతో నిర్మాతలు షాక్‌కు గురవుతున్నారు..!!

mummy film actor Arnold Vosloo for vijay d’s ranabaali!

routine that helps samantha overcome self-doubt and negatives!