
విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వెంకీ-అనిల్5’ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు సందడి చేశారు. చిత్ర హీరో వెంకటేష్‌తో పాటు కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కృతి శెట్టి, కీర్తి సురేష్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుండి ప్రారంభం కానుంది..!!

