in

Samantha admits she got addicted to stardom and egoistic!

స్టార్‌డమ్‌ మత్తులో తాను కూడా కొట్టుకుపోయానని, వరుస విజయాలు తనలో అహంకారాన్ని పెంచాయని ప్రముఖ నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య వల్ల ఇటీవల తీసుకున్న విరామం తన జీవితాన్ని, కెరీర్‌ను కొత్త కోణంలో చూసేలా చేసిందని వెల్లడించారు.‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు..

‘‘చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయిగా స్టార్‌డమ్‌ను అనుభవించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ప్రేక్షకులు నా పేరును అరుస్తూ, నా సినిమాల కోసం ఎదురుచూడటం చూసి మరింత కష్టపడ్డాను. ఓ దశలో స్టార్‌డమ్‌ అనే ఆటకు బానిసయ్యాను. ఏడాదిలో ఐదు సినిమాలు చేశాను. అవన్నీ హిట్లు కావడంతో నాకో ‘గోల్డెన్‌ లెగ్‌’ ఉందని అందరూ అనేవారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండాలనే ఒత్తిడిని నేనే నాపై పెట్టుకున్నా’’ అని చెప్పారు..!!

HAPPY BIRTHDAY KORATALA SIVA!

Anil Ravipudi brings Keerthy Suresh and Krithi Shetty on board!