in

Kajal Aggarwal has been cast as Mandodari, the wife of Ravana!

బాలీవుడ్ వెండితెరపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, కళ్లు చెదిరే విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా ‘రామాయణ’ . ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ త్రీడీ విజువల్ ఎపిక్ ప్రాజెక్ట్‌పై ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో నటీనటుల ఎంపికకు సంబంధించి రోజుకో క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రపై వస్తున్న రూమర్స్‌కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అఫీషియల్ ఎండ్‌కార్డ్ వేశారు..

ఈ సినిమాలో లంకాధిపతి రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రావణుడి సతీమణి ‘మండోదరి’ పాత్రలో కాజల్ అగర్వాల్ నటించబోతోందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన ఒక అవార్డు వేడుకలో కాజల్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారికంగా స్పందించారు. “నా సుదీర్ఘ సినీ కెరీర్‌లోనే ఇంతటి భారీ, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా షూటింగ్ కోసం, నా పాత్రను వెండితెరపై ఆవిష్కరించడం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని కాజల్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాలో మండోదరిగా కాజల్ కనిపించబోతుందనే వార్త ఖరారైపోయింది..!!

Naga Chaitanya turns producer with ‘Dhootha 2’!

SOUTH INDIAN HEROINE WHO IMPRESSED NEHRU!