in

Double Birthday Treat for Balakrishna Fans!

ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK111 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా #NBK111 నుంచి పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.

అదే సమయంలో బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న #NBK112 ప్రాజెక్ట్‌ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. సామాజిక అంశాలను కమర్షియల్ కథనాలతో మిళితం చేయడంలో దిట్ట అయిన కొరటాల శివ, బాలయ్య ఇమేజ్‌కు తగ్గ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేయనున్నారు. గోపీచంద్ మలినేని, కొరటాల శివ ఇదరూ మాస్ పల్స్ తెలిసిన దర్శకులు. దీంతో సహజంగానే ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి..!!

Priyanka Mohan appointed as Ambassador for South Korean tourism!