
నేచురల్ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి తాజాగా తన బాలీవుడ్ సినిమా ఏక్ దిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా సాయి పల్లవి బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ సినిమా ఎంపిక గురించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. “నేను అప్పట్లో చాలా ఎమోషనల్ కథల్లో నటిస్తున్నాను. అందుకే కొంచెం లైట్‌గా, మనసుకు హాయిగా ఉండే కథ చేయాలని అనిపించింది.
అదే సమయంలో ‘ఏక్ దిన్’ కథ వినిపించారు. ఆ కథ విన్న వెంటనే నాకు హాలీవుడ్ క్లాసిక్ మూవీ బిఫోర్ సన్ రైస్ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను” అని తెలిపారు. అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం తనకు కొంత నిరాశ కలిగిందని ఆమె చెప్పారు. “ప్రీమియర్ చూసిన తర్వాత ఈ పాత్రకు నేను పూర్తిగా సరిపోలేదేమో అనిపించింది. ఇదే విషయాన్ని ఆమిర్ ఖాన్‌కి కూడా చెప్పాను. నా బదులు ఇంకెవరైనా చురుకైన కొత్త అమ్మాయి ఈ పాత్ర చేస్తే బాగుండేదేమో అనిపించింది” అని సాయి పల్లవి చెప్పారు..!!

