
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సూపర్ హీరో సబ్జెక్టు ఓకే చేశారు. ఆ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అందులో కథానాయికగా మొదట సమంత పేరు వినిపించింది. రాజ్ నిడిమోరుతో సమంత వివాహం జరగడం..రాజ్ అండ్ డీకే క్రియేటివ్ సూపర్ విజన్, షో రన్నర్లుగా వచ్చిన ‘సిటాడెల్’లో సమంత నటించి ఉండటంతో..ఇక నుంచి వాళ్ళు చేయబోయే ప్రాజెక్టులలో సమంత ఉంటారని బాలీవుడ్ వర్గాలు సైతం భావించాయి. అయితే.. ఆమెను కాదని బాలీవుడ్ భామను ఎంపిక చేశారట..
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్న సూపర్ హీరో ప్రాజెక్టులో కథానాయికగా కరీనా కపూర్ ఖరారు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో నటించాలని సల్మాన్ ఖాన్ స్వయంగా కరీనాకు ఫోన్ చేసి కథ గురించి డిస్కస్ చేయగా..ఆమె ‘ఎస్’ అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కరీనా కపూర్ గనుక ఈ సినిమా ఒప్పుకొంటే..సల్మాన్ ఖాన్‌తో ఆమె కలిసి నటిస్తున్న ఐదవ సినిమా అవుతుంది. ఇంతకు ముందు వీరిద్దరూ ‘బజరంగీ భాయిజాన్’, ‘క్యోన్ కీ’, ‘మై ఔర్ మిసెస్ ఖన్నా’, ‘బాడీగార్డ్’లో జంటగా నటించారు..!!
