
సాధారణంగా భారీ యాక్షన్ సన్నివేశాలు లేదా ప్రమాదకరమైన విన్యాసాలు చేయాల్సి వచ్చినప్పుడు అగ్ర నటీనటులు సైతం డూప్ వైపు మొగ్గు చూపుతారు. కానీ రష్మిక మందన్న మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద జరుగుతున్న చిత్రీకరణలో ఆమె సుమారు 80 అడుగుల ఎత్తు నుండి ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా దూకి అందరినీ ఆశ్చర్యపరిచింది. గోండు తెగకు చెందిన మహిళగా నటిస్తున్న రష్మిక, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఈ సాహసానికి పూనుకుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని గాయాలైనప్పటికీ, వాటిని లెక్కచేయకుండా చిత్రీకరణను పూర్తి చేయడం ఆమె వృత్తి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం..!!
