in

Maa Inti Bangaaram Beats Arundhati; Creates Box Office History!

మంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు తెలుగులో విడుదలైన ఫిమేల్ లీడ్ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మా ఇంటి బంగారం నిలిచిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది..

ఈ రికార్డుతో సమంత కెరీర్‌లో మరో మైలురాయి చేరినట్లైంది. ఇప్పటివరకు ఏ తెలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రం నమోదు చేయని స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూడా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!

Pooja Hegde joining Pawan Kalyan’s ‘OG 2’ or not?