in

samantha about her family man raj nidumoru!

ర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును ప్రముఖ సినీ నటి సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మరోవైపు, వీరి జీవిత ప్రయాణం సంతోషంగా, అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ సమంత-రాజ్ నిడిమోరుల బంధం మరింత బలపడుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి విజయవంతమైన ప్రాజెక్టుల తర్వాత, ఇప్పుడు ఈ జంట ‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం జట్టు కట్టారు..

సమంత సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ద్వారా రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెన్నెల కిషోర్ అడిగిన ‘మీ ఫ్యామిలీ మ్యాన్’ ఎలా ఉంటారు? అనే ప్రశ్నకు సమాధానంగా..”రాజ్ చాలా గ్రేట్, ఆయనో అద్భుతమైన క్రియేటర్” అంటూ సమంత తన భర్తపై ప్రశంసలు కురిపించడం వారి మధ్య ఉన్న గౌరవాన్ని చాటిచెబుతోంది..!!

rashmika doing high-intensity action sequences without dupe!

Buchi Babu Sana pins his all hopes on ‘peddi’!