in

Adivi Sesh To Team Up With The Girlfriend Director Rahul Ravindran!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, విలక్షణ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథాంశంతో రానున్న ఈ ప్రాజెక్ట్ గురించి అడివి శేష్ తన తాజా చిత్రం ‘డెకాయిట్’ ప్రమోషన్ల సందర్భంగా అధికారికంగా ధృవీకరించారు. ఈ ఆసక్తికర కలయిక టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. నటుడిగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అడివి శేష్, ప్రస్తుతం వరుస విజయాలతో జోరు మీదున్నారు..

తాజాగా ఆయన నటించిన ‘డెకాయిట్’ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంటోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, తన తదుపరి చిత్రాల గురించి అడివి శేష్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘చి ల సౌ’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో శేష్ ఒక సినిమా చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం శేష్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గూఢచారి 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ భారీ స్పై థ్రిల్లర్ షూటింగ్ పూర్తయిన వెంటనే రాహుల్ రవీంద్రన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది..!!

Trisha’s Chennai residence receives false bomb threat!

f cube ‘Dimple Hayathi’