
విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. వారి ప్రకారం, విష్ణుప్రియ తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా ఈ కంటెంట్ పెట్టడం వల్ల చెడు ప్రభావం పడుతుందని వారు తెలిపారు. అంతే కాకుండా, కొన్ని ప్రత్యేక వీడియోలు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆమె సోషల్ మీడియా అకౌంట్‌ను నిలిపివేయాలని పోలీసులను కోరారు.
