in

Aishwarya Rajesh Locked in for Nagarjuna’s 100th Film!

క్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం ‘లాటరీ కింగ్’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య, ఇప్పుడు నాగార్జునతో జోడీ కట్టడంపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది..

వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాకు కొత్తదనాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున వంటి స్టార్ హీరో తన ల్యాండ్‌మార్క్ మూవీ కోసం ఒక యువ తమిళ దర్శకుడిని నమ్మడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ’లాటరీ కింగ్’లో నాగార్జున అత్యంత స్టైలిష్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన నటించిన శివ, రక్షకుడు, కూలీ వంటి చిత్రాల గెటప్పుల స్ఫూర్తితో ఇందులో రకరకాల వేరియేషన్స్ ఉంటాయని సమాచారం..!!

young hero Sharwanand to romance Pooja Hegde!

Raai Laxmi making her comeback to tollywood?