in

Jonita gandhi to do an item song for adivi sesh’s dacoit!

క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్’ అంటూ ఇలా వరుసగా విజయాల్ని అందుకుంటూ వచ్చాడు. అయితే ‘మేజర్’ తరువాత అడివి శేష్ నుంచి మళ్లీ ఇంత వరకు ఓ సినిమా కూడా రాలేదు. గత మూడేళ్లుగా ‘డెకాయిట్’ చుట్టూనే అడివి శేష్ తిరుగుతున్నాడు. ఇది కాకుండా ‘గూఢచారి 2’ కూడా లైన్లో ఉంది. అయితే ఈ డెకాయిట్ విషయంలో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఏర్పడ్డాయి. హీరోయిన్ మార్పు వల్ల కూడా సినిమా చాలానే ఆలస్యమైంది. ఇక ఇప్పుడు ఈ మూవీని ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయబోతోన్నారు..

విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌ కూడా పెంచేశారు. ఇప్పటి వరకు వదిలిన గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ‘డెకాయిట్’ మీద అంచనాల్ని పెంచేసింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉందని కొనియాడుతున్నారంతా. అయితే తాజాగా ఈ మూవీలో ఓ మాస్ నంబర్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటను మార్చి 28న విడుదల చేయబోతోన్నారు. అయితే ఈ పాటలో జోనితా గాంధీతో కలిసి అడివి శేష్ స్టెప్పులు వేయబోతోన్నాడట..!!

Ustaad Bhagat Singh director Harish Shankar responds to trolls!