in

Ram Charan injured during Peddi shoot!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు చిన్నపాటి గాయమైనట్లు సమాచారం. ఆయన కంటి సమీపంలో గాయం తగిలిందని, అయితే ఇది చాలా స్వల్పమైనది కావడంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

​ఈ గాయం కారణంగా చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత తిరిగి సెట్స్‌లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, త్వరలోనే ఒక స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. మరీ ముఖ్యంగా, ఈ శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ చిత్రం నుండి క్రేజీ టీజర్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ​వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది..!!

VV Vinayak ends ntr’s adhurs sequel rumors!

Shruti Haasan reveals about her friendship with Dulquer Salmaan!