in

Nora Fatehi Reacts To Vulgar Song Controversy!

న్నడ హీరో ధ్రువ సర్జా, దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన ‘కేడీ’ సినిమా ఇప్పుడు వివాదాల్లో నిలిచింది. ఇటీవలే విడుదలైన ఆ సినిమా ఐటెం సాంగ్ అందుకు ప్రధానకారణం. ఆ పాట ఇప్పుడు అసభ్యంగా ఉందని నెటిజన్లు విమర్శించారు. అంతేకాకుండా ఈ సాంగ్ గురించి నేడు లోక్‌సభలోనూ చర్చ జరిగింది. అయితే ఈ ఐటెంసాంగ్‌ దుమారంపై అందులో నటించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి స్పందించింది. అయితే ఆ సాంగ్ చిత్రీకరించిన సమయంలో కన్నడ పాట ప్లే చేసిన కారణంగా ఆ పదాలు తనకు అర్థం కాలేదని నటి నోరా ఫతేహి చెప్పింది..

పాటలోని సాహిత్యం అర్థాన్ని తెలుసుకునేందుకు తాను చిత్రబృందం చెప్పిన మాట విన్నానని స్పష్టం చేసింది. వాళ్లు తనకు వివరించే క్రమంలో తనకు ఎలాంటి బూతులాగా అనిపించలేదని నోరా చెప్పింది. నాకు హిందీ వచ్చు. తాజాగా విడుదలైన తర్వాత హిందీ వెర్షన్ విన్నాక ఈ సాంగ్ వివాదం తెస్తుందని ముందే నాకు తెలిసిపోయిందని నోరా ఫతేహి స్పష్టం చేసింది. అంతేకాకుండా తన అనుమతి లేకుండా చిత్రబృందం AI టెక్నాలజీని ఉపయోగించి తనతో పాటు సంజయ్ దత్ ఫోటోలను ప్రచారానికి వాడినందుకు నోరా ఫతేహి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన గౌరవాన్ని భంగం కలిగించే ఏ విషయాన్నైనా తాను సమర్థించనని నోరా అంటోంది..!!

Mani Ratnam Announces New Film With Vijay Sethupathi, Sai Pallavi!