in

Rithu Chowdary Opens Up About Her Love and breakup!

 

బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన వ్యక్తిగత జీవితం, ప్రేమలో ఎదురైన చేదు అనుభవాలను ఉద్దేశిస్తూ ఆమె పెట్టిన ఈ సుదీర్ఘ పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తన రిలేషన్ బ్రేక్ అవ్వడంపై సోషల్ మీడియా వేదికగా రీతూ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం అమ్మాయిలను చాలా సులభంగా జడ్జ్ చేస్తుందని, కానీ వారు అనుభవించే బాధను ఎవరూ అర్థం చేసుకోరని పేర్కొంది..

తాను ఒక వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని, కానీ చివరకు తనకు ‘హార్ట్ బ్రేక్’ మిగిలిందని ఎమోషనల్ అయింది. ఒకప్పుడు తన ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితోనే రిలేషన్‌లోకి వెళ్ళిపోయాడని చెప్పింది. ప్రేమలో మోసపోవడం వల్ల తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళానని, కానీ కెరీర్ కోసం ముఖంపై నవ్వును నటిస్తూ ముందుకు సాగుతున్నానని రీతూ వెల్లడించింది. తనను నెగిటివ్‌గా చూపిస్తూ కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు తనను మరింత కలిచివేస్తున్నాయని, నిశ్శబ్దాన్నే తన బలంగా మార్చుకున్నానని తెలిపింది..!!

here is the much awaited update on Anushka Shetty’s kathanar!

Mani Ratnam Announces New Film With Vijay Sethupathi, Sai Pallavi!