
దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబంలో త్వరలోనే శుభకార్యం జరగబోతుందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కీరవాణి కుమారుడు, తన గాత్రంతోనూ, సంగీతంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే, ఆయన పెళ్లాడబోయే అమ్మాయి మరెవరో కాదు..
టాలీవుడ్ యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు ఫిలిం నగర్ టాక్. కాలభైరవ ‘కార్తికేయ 2’ వంటి చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తన సత్తా చాటగా, కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ‘మసూద’, ‘బలగం’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది..!!
