in

The title reveal of Allu Arjun and Atlee’s film on this day!

పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ‘జవాన్’ వంటి భారీ హిట్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన అట్లీ, అల్లు అర్జున్‌ను ఎలా చూపిస్తారా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడం వల్ల ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..

ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. అట్లీ సినిమాల్లో ఉండే కమర్షియల్ అంశాలు, ఎమోషన్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్‌కి సరిగ్గా సరిపోతాయని అభిమానులు నమ్ముతున్నారు. పుట్టినరోజు కానుకగా రాబోయే ఈ వీడియో అసెట్, సినిమా ప్రమోషన్లకు ఒక బలమైన పునాదిని వేయనుంది. ఏప్రిల్ 8న రాబోయే ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టారు..!!

Rashmika mandanna says ‘Bhooma Devi is close to my heart’!