
ఆదా శర్మ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. డేట్స్ సర్దుబాటు చేసే క్రమంలో ఓ నిర్మాత తన మేనేజర్‌ను బూతులు తిట్టారని, ఆ నిర్మాత తీరు వల్ల తాను నెల రోజుల పాటు ఎలాంటి పని లేకుండా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు..
తాను ఒకే సమయంలో మూడు సినిమాలకు అంగీకరించానని, అయితే మొదటి సినిమా డేట్స్ పదే పదే మారడంతో మిగతా రెండు ప్రాజెక్టుల షెడ్యూల్స్కు ఇబ్బంది వచ్చిందని ఆదా తెలిపారు. అయినా సరే మొదటి సినిమా నిర్మాత తనకు ఆ పలానా తేదీలే కావాలని పట్టుబట్టారని, ఈ క్రమంలో తన మేనేజర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా ఇద్దరు దర్శకులు చాలా హుందాగా వ్యవహరించి తమ షూటింగ్ తేదీలను మార్చుకున్నారని ఆదా వివరించారు..!!
