in

Kriti Sanon and Rashmika to play a lesbian couple in Cocktail 2?

ష్మిక మందన్న, ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా భావిస్తున్న ‘కాక్‌టెయిల్ 2’లో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రానున్న ఈ చిత్రంలో కృతి సనన్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వీరిద్దరూ స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ వీరి పాత్రల గురించి ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇదొక విభిన్నమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, రష్మిక-కృతి పాత్రల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..!!

Samantha REVEALS how she handles praises and trolls!