
సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌ను ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ, ప్రశంసలు తనను పొంగిపోయేలా చేయవని, అలాగే విమర్శలు తనను కుంగదీయలేవని స్పష్టం చేశారు. అయితే తన డిజిటల్ స్పేస్‌లోకి ఎవరైనా కావాలని నెగిటివిటీని తీసుకొస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు..
తన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, తన సోషల్ మీడియా పేజీని కూడా అలాగే ఉంచుకోవాలని భావిస్తానని ఆమె పేర్కొన్నారు. ఎవరినైనా బ్లాక్ చేశానంటే వారు తనను బాధపెట్టినట్లు కాదని, తన ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థమని అన్నారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా రీల్స్ వల్ల సమయం వృథా అవ్వడంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నప్పుడు చదువుకోవడానికి ఒక టైమ్ టేబుల్ ఉండేదని, కానీ ఇప్పుడు రీల్స్ వల్ల ఏకాగ్రతను కోల్పోతున్నామేమో అనే భయం వేస్తోందని ఆమె అంగీకరించారు..!!
