
కూలీ’లో ప్రతినాయకుడిగా అద్భుతమైన నటన కనబరిచిన నేపథ్యంలో, ‘ధురంధర్’లో అవకాశం వచ్చినా వదులుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో రెహమాన్ డెకాయిట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అయితే, ఈ పాత్రకు మొదట నాగార్జునను సంప్రదించారని, ‘కూలీ’ సినిమా షూటింగ్ వల్ల ఆయన తిరస్కరించారని కథనాలు వెలువడ్డాయి.

