in

another telugu girl manasa varanasi testing the cinema luck!

టు ఆంధ్ర నుంచి మాత్రమే కాదు, ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా పరిచయమవుతున్న హీరోయిన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వరంగల్ నుంచి తెలుగు తెరకి పరిచయమైన ఆనంది, తమిళంలో స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగులో సినిమాలు చేస్తోంది. ఈషా రెబ్బా కూడా తనదైన స్టైల్లో సినిమాలు..సిరీస్ లు చేస్తూ వెళుతోంది. ఇక వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘మానస వారణాసి’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అందాల పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో అలరించనుంది. మానస వారణాసి ఇంతకు ముందు ఒక సినిమా చేసినప్పటికీ, కొన్ని కారణాల వలన అది ఆడియన్స్ కి రీచ్ కాలేదు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం రిలీజ్ కి ముందే మంచి బజ్ తెచ్చుకుంది..!!

36 years for ‘CHETTU KINDA PLEADER’!

kannappa beauty Preity Mukhudan to play the daughter of Chiranjeevi!