in

Rashmika to play negative role in Allu Arjun Atlee Film!

పుష్ప’ ఫ్రాంచైజీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక హిట్ జోడీగా తమ నటనతో అందరినీ మెప్పించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా అట్లీ పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో. గత రోల్స్ కంటే డిఫరెంట్‌గా అట్లీ అల్లు అర్జున్ మూవీలో రష్మిక నెగిటివ్ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం సాగుతున్నా..ఇప్పుడు ఆ పాత్ర షూటింగ్ కోసం నేషనల్ క్రష్ సెట్‌లో అడుగు పెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి..

ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ సాగుతుండగా..కొత్త షెడ్యూల్‌లో ఆమెతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సీన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. మరి సిల్వర్ స్క్రీన్‌పై బన్నీ, రష్మికల పోరు ఎలా ఉంటుందోనని భారీ హైప్ క్రియేట్ అవుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే యావత్ సినీ ప్రపంచం ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతాన్ని చూపించబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ ఫస్ట్ వీడియోలోనే చూపించేశారు..!!

fauji heroine imanvi for Pawan Kalyan’s next?