
పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘ఫౌజీ’ సినిమాలో నటించిన హీరోయిన్ ఇమాన్‌వి ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం..
ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపికపై మేకర్స్ సీరియస్‌గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇమాన్‌వి పేరు బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఈ సినిమాని 2026 దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇమాన్‌వి నటించారు. ఇమాన్‌వి తన నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుందన్న టాక్ ఉంది..!!

