in

Prakash Raj rubbishes prabhas ‘Spirit’ exit rumours!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను తొలగించారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా విషపూరితమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.

ఈ విషయంపై ప్రకాశ్‌ రాజ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “స్పిరిట్ సినిమాపై విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పెడ్లర్స్‌ అందరికీ చెబుతున్నా..ఈ సినిమాలో నా సన్నివేశాల షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, మీరు వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేచి ఎవరి జీవితాన్ని వాళ్లు గడపండి” అని ఘాటుగా స్పందించారు. దీనికి నవ్వుతున్న ఎమోజీలను, ‘#JustAsking’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. దీంతో ఈ వదంతులకు పూర్తిస్థాయిలో చెక్ పడినట్లయింది..!!

prabhas rajasaab effect, no more dupes please!

fauji heroine imanvi for Pawan Kalyan’s next?