in

raashi khanna to replace meenkashi chaudhary for hindi remake!

సంక్రాంతికి వస్తున్నాం..ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో మూవీ ఉండనుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా… ఈ మూవీ గురించి మరో లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకీ సరసన ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక బాలీవుడ్ రీమేక్‌లో మీనాక్షి చౌదరి పాత్రను రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ పాత్రను విద్యా బాలన్ పోషించనున్నారట..!!

Mouni Roy Harassed by ‘Elderly Men’ at Haryana Event

Mouni Roy Harassed by ‘Older Men’ at Haryana Event