in

i am not married, Dimple Hayathi clarifies!

మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ తో పాటు డింపుల్ హయాతి కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఐతే, తాజాగా డింపుల్ సోషల్ మీడియాలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. గతంలో, డింపుల్ హయాతికి డేవిడ్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి.

ఒక అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ, డింపుల్ హయాతి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ, డింపుల్ ఏం మాట్లాడింది అంటే..‘గతంలోనే నాకు పెళ్లి అయింది అని వార్తలు వచ్చాయి. నిజానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, వాటిలో ఎలాంటి వాస్తవం లేదు’ అని డింపుల్ హయాతి స్పష్టం చేసింది. ప్రస్తుతం డింపుల్ హయాతి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం..గత కొంతకాలంగా డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తితో కలిసి ఉంటుంది..!!

Pooja Hedge reveals she slapped a star hero!