in

Kajol Devgn believes marriage should have an expiry date!

సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పెళ్లికి కూడా ఓ ‘ఎక్స్‌పైరీ డేట్’ (గడువు తేదీ), ‘రెన్యువల్ ఆప్షన్’ (పునరుద్ధరణ అవకాశం) ఉండాలని ఆమె పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా 26 ఏళ్లుగా వైవాహిక బంధంలో కొనసాగుతున్న ఆమె ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది..

వివరాల్లోకి వెళితే.. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా “వివాహానికి గడువు తేదీ, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించారు. దీనికి విక్కీ, కృతి, ట్వింకిల్ ‘వద్దు’ అని చెబుతూ రెడ్ జోన్‌లో నిలబడగా, కాజోల్ మాత్రం ‘అవును’ అంటూ గ్రీన్ జోన్‌లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు..!!

HAPPY BIRTHDAY P SUSHEELA!

sandeep vanga clarifies About Chiranjeevi in Prabhas Spirit!