in

Malavika Mohanan Denies Being Part Of Chiranjeevi’s film!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటి మాళవిక మోహనన్ స్పష్టత ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ వదంతులేనని ఆమె తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

“మెగా 158 చిత్రంలో నేను నటిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. ఐకానిక్ స్టార్ చిరంజీవి గారితో ఏదో ఒక రోజు స్క్రీన్ పంచుకోవాలనే కోరిక నాకు బలంగా ఉంది. కానీ, ప్రస్తుతానికి నేను ఆ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదు. దయచేసి ఆ వదంతులను నమ్మవద్దు” అని మాళవిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో చిరంజీవి సరసన నటించబోయే హీరోయిన్‌పై గత కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది..!!

20’s actress last movies as main lead in telugu!

director atlee finalized 3 heroines for allu arjun’s film?