టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆశించిన విధంగానే ఆయన బయోపిక్‌లో నటుడు రాజ్‌కుమార్ రావ్ నటించనున్నారు. 2021 నుంచే గంగూలీ బయోపిక్ పనులు ప్రారంభం కాగా, తన పాత్ర పోషించేందుకు రాజ్‌కుమార్ రావ్ అయితే బాగుంటుందని గంగూలీ ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారు. దాంతో రాజ్‌కుమార్ రావే హీరో అని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా షూటింగ్ కూడా ప్రారంభమైందంటూ బాలీవుడ్లో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి..
విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ రంజన్ నిర్మిస్తున్నారు. అయితే దీనిపై తొలిసారిగా నటుడు రాజ్ కుమార్ రావ్ స్పందించారు. ఆ సినిమాలో తాను నటిస్తున్నట్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. తెరపై గంగూలీ మాదిరిగా కనిపించేందుకు కొంచెం ఒత్తిడి ఉందని అన్నారు. గంగూలీ బయోపిక్‌లో నటించడం ఒక పెద్ద బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం తన భార్య నుంచి బెంగాలీ భాషను నేర్చుకున్నానని రాజ్‌కుమార్ రావ్ తెలిపారు..!!!