in

Ram Charan gears up for grand train sequence for Peddi

ప్రస్తుతం ఓ భారీ ట్రైన్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ ట్రైన్ ఎపిసోడ్ లోనే కీలకమైన యాక్షన్ సీన్లు ఉంటాయంట. పైగా రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కూడా ఇక్కడే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ పెద్దిలో ట్రైన్ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అన్నట్టే ఉంటుందంట. హై ఇంటెన్స్ యాక్షన్ సీన్లతో ఈ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి యాక్షన్ ఎంట్రీ సీన్ గతంలో ఎవరూ చూపించని విధంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.

ఫైట్ మాస్టర్ నభాకాంత్ నేతృత్వంలో ఈ మొత్తం ఎపిసోడ్ ను తీస్తున్నారు. దీని తర్వాత ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. బుచ్చిబాబు క్రియేట్ చేసిన మాస్ సీన్లు ఆకట్టుకుంటాయని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్‌ కూడా ఈ మూవీ రంగస్థలంను మించి ఉంటుందని చెప్పేశాడు. మాస్, ఎమోషన్ కలగలిపి మూవీని తీస్తున్నామని చెప్పకనే చెప్పేశాడు. ఈ ట్రైన్ ఎపిసోడ్ తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య సీన్లు ఉంటాయని తెలుస్తోంది..!!

rakul preet singh to play surpanaka in ramanyan!