మొదటిభాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక ,రెండో పార్ట్ లో తన పాత్రపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మొదటిభాగం చివర్లో పుష్పరాజ్‌కు శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపిన విషయం తెలిసిందే. ఇదే మాటను రష్మిక చెప్పారు. ‘నేను రెండో పార్ట్‌లో పుష్పకు భార్యగా కనిపిస్తాను.ఇందులో ఎన్నో బాధ్యతలు ఉంటాయి.
ఈ సీక్వెల్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది అని అన్నారు. సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా తీస్తారు అని చెప్పింది. ఫస్ట్ పార్ట్ కి భారీ స్థాయిలో స్పందన రావడంతో రెండో పార్ట్‌పై అధిక అంచనాలు నెలకొన్నాయి. సీన్స్‌లో ఎంత బాగా నటించగలమనేది ఆర్టిస్టులపై ఆధారపడి ఉంటుంది అని రష్మిక తెలిపారు..!!