in

Venky mama To Romance Meenakshi Chaudhary!

సైందవ్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన వెంకటేష్ ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. నెక్స్ట్ F2 , F3 లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి తో ఒక సినిమాకి కమిట్ అయ్యారు. వెంకీ కెరీర్ కి ఇది 76 వ సినిమా. ఈ మూవీ కామెడీ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డీటెయిల్స్ త్వరలో అధికారికంగా రానున్నాయని తెలుస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో  వెంకీ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మీనాక్షి రీసెంట్గా గుంటూరు కారంలో నటించింది. తన పాత్రకి  పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆ సినిమా తరువాతా అవకాశాలు అందుకుంటోంది.  ఆకట్టుకునే అందం, అభినయంతో  ఒక వైపు యంగ్ స్టార్స్ పక్కన, మరో పక్క సీనియర్ హీరోలతో ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది.

Rashmika Mandanna gives update on Pushpa 2

happy birthday nassar!