in

Allu Arjun to attend ‘Berlin Film Festival’ for Pushpa screening!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌’ పాల్గొనేందుకు బెర్లిన్ బయలుదేరాడు. ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుప్ప: ది రైజ్’ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. కాగా తన పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ దర్శకులు, చిత్ర నిర్మాతలు, మార్కెట్‌లో సినిమా హక్కుల కొనుగోలుదారులతో మాట్లాడనున్నాడు.

‘పుష్ప’ మూవీ స్క్రీనింగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ మీడియాతో ఐకాన్ స్టార్ మాట్లాడతాడు. కాగా పుష్ప సినిమా రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇతర దేశాల్లోనూ కూడా ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2: ది రూల్’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది..!!

anupama and siddhu intense sensuous chemistry!

Ooru Peru Bhairavakona!