యానిమల్ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావస్తుండగా.. ఈ సినిమా ద్వారా సందీప్ రెడ్డి సాధించిన ఆదాయం గురించి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో ఏకంగా 200 కోట్లు జేబులో వేసుకున్నాడట సందీప్. కబీర్ సింగ్ లాగే యానిమల్ కు కూడా అతను నిర్మాణ భాగస్వామి. కబీర్ సింగ్ ఆదాయాన్ని ఇందులో పెట్టుబడి పెట్టాడు..
దీంతోపాటు దర్శకుడిగా పారితోషకం తీసుకోకుండా వాటా పుచ్చుకున్నాడు. ఇలా రెండు రకాలుగా అతడికి యానిమల్ సినిమా ద్వారా 200 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. హీరో రణబీర్ కపూర్ ఈ సినిమాకు 70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా.. దర్శకుడు, నిర్మాణం భాగస్వామి అయిన సందీప్ ఏకంగా అతనికంటే మూడు రెట్లు ఆదాయం సాధించినట్లు సమాచారం..!!