పుష్ప 1 ది రైజ్ ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టరయ్యాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మాములుగా పెరగలేదు. ముఖ్యంగా మార్కెట్ కోణంలో బ్రాండ్ లను ప్రమోట్ చేయడానికి సంస్థలు ఆఫర్ చేస్తున్న మొత్తం కళ్లుచెదిరేలా ఉందని లేటెస్ట్ టాక్. ఒక్క రోజుకు గాను బన్నీ అక్షరాలా 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు ముంబై అప్డేట్. కొన్నేళ్ల క్రితం అరవై లక్షల రేంజ్ లో ఉన్న ధర కాస్తా నేషనల్ అవార్డు వచ్చాక ఇంకా పెరిగిపోయిందని అంటున్నారు.
ఇలాంటివి అధికారికంగా చెప్పరు కానీ లీకవుతున్న డిజిటల్ వర్గాల సమాచారం మేరకు వ్యవహారం నమ్మశక్యంగానే ఉంది. ఒకవేళ ఏదైనా బ్రాండ్ బన్నీని ఉపయోగించు కోవాలనుకుంటే అంత ఫీజు చెల్లించాల్సిందే. సింగల్ కాల్ షీట్లోనే మొత్తం చిత్రీకరణ, ఫోటో షూట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా ఏదైనా కావాలంటే ఛార్జ్ ఎక్స్ ట్రా. పుష్పకు వచ్చిన రీచ్ చూశాక ఇది న్యాయమైన మొత్తమేనని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయట..!!