సినిమా షూటింగ్ సందర్భంగా సముద్రంలో పడిపోయిన తనను హీరోయిన్ కావ్య థాపర్, కెమెరామెన్ అసిస్టెంట్స్ రక్షించారని హీరో విజయ్ ఆంటోని చెప్పారు. భవిష్యత్‌లో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలని ఉందని ఆయన తెలిపారు. విజయ్ ఆంటోని – కావ్య థాపర్ జంటగా నటించిన చిత్రం ‘పిచ్చైకారన్-2’ . ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది..ఈ మూవీ ట్రైలర్‌ను గత నెలలో విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం తాజాగా చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది..
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ మాట్లాడుతూ..‘‘సాధారణంగా ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటులు గాయపడుతుంటారు. కానీ, నేను హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సన్నివేశ చిత్రీకరణ సమయంలో గాయపడ్డాను. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సముద్రంలో పడిపోయిన నన్ను హీరోయిన్, కెమెరామెన్ అసిస్టెంట్స్ రక్షించారు. ఈ చిత్రం ‘పిచ్చైకారన్’ కథకు సీక్వెల్ కాదు. ఇది వేరే స్టోరీ. ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటారు. ఈ చిత్రానికి యాదృచ్ఛికంగా దర్శకత్వం వహించాను..!!