in

Prabhas interesting comments on Chatrapathi remake!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఛత్రపతి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతికి ఇది రీమేక్. ఇక ఈ సినిమాని హిందీలో మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ తెరకెక్కిస్తున్నాడు. మే 12న ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి మాస్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది ట్రైలర్.  దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులే కాదు..తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ తాజాగా ఈ సినిమాపై తన ఒపీనియన్ ని షేర్ చేసాడట డార్లింగ్ ప్రభాస్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈమేరకు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ముందుగా తాను ఆలోచించానని అన్నారు. అయితే ప్రభాస్ తో ఈ రీమేక్ విషయం చర్చించినప్పుడు నువ్వు ఈ మూవీ చేయడానికి పూర్తిస్థాయిలో అర్హత ఉన్నావాడివి.. నువ్వు చేయగలవ్ అంటూ ధైర్యం ఇచ్చాడని. దాంతో తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

pooja hegde gets another crazy offer in bollywood!

vijay anthony: my heroine Kavya Thapar saved my life