అందాల నటుడు శోభన్ బాబు గారు ఎంతో నిబద్ధత కలిగిన నటుడు, అలాగే ఆయన ఎటువంటి భేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారని అందరు చెపుతారు. ఆయన ఎంత ఫ్రాంక్ గ ఉంటారు అనే విషయం కళాతపస్వి విశ్వనాధ్ గారు ఒక సందర్భంలో వెల్లడించటం జరిగింది. శోభన్ బాబు గారు డాన్స్ సీన్స్ లో కొంత ఇబ్బంది పడే వారు, శోభన్ బాబు లిప్ సింక్ సరిగా లేదయ్యా!! అని విశ్వనాథ గారు అనగానే, డాన్స్ లో లయ, సాంగ్ లో లిప్ సింక్, ఈ రెండిట్లో ఏదో ఒకటి సరి చూసుకోండి, రెండు కావాలంటే నా వల్ల కాదు గురువు గారు అని చెప్పేసేవారట. అదే విధంగా శోభన్ బాబు గారికి ఒక చిత్రమయిన అలవాటు ఉండేదట, డ్యూయిట్ చిత్రీకరణ జరుగుతున్నపుడు నగారా లో పాట స్టార్ట్ కాగానే, విశ్వనాథ గారు యాక్షన్ అనగానే , శోభన్ బాబు గారు హీరోయిన్ నడుము చుట్టూ చేయి వేసేసే వారట, ఇదేమిటయ్యా, ఆలా చెయ్యి వేయమని నేను చెప్ప లేదుగా అనే వారట విశ్వనాథ్ గారు, అదేమిటో ఆలా అనుకోకుండా చేయి వెళ్ళిపోతుంది, ఆలా వేయక పోతే డాన్స్ స్టెప్ పడటం లేదు గురువు గారు అని చాల ఫ్రాంక్ గ చెప్పేసే వారట శోభన్ బాబు గారు.
ఇదంతా మనకు వినటానికి హాస్యంగా ఉన్న ఆయన లోని ఫ్రాంక్ నెస్ కి ఇదొక ఉదాహరణ గ చెప్పుకోవచ్చు. డాన్స్ వేయటం లో కొంత ఇబ్బంది ఉన్నా , డాన్స్ మాస్టర్ మీద నెపం నెట్టేయకుండా తన మైనస్ పాయింట్ ని నిక్కచ్చిగా అంగీకరించటం ఎంత మంది చేయగలరు. అదే విధంగా ఒత్తిడి లో ఉన్నపుడు మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాము, అదే క్రమం లో శోభన్ బాబు గారు హీరోయిన్ నడుము చుట్టూ చేయి వేసేసే వారు, ఆ విషయాన్నీ కూడా ఎంత నిజాయితీ గ ఒప్పకోవటం గమనార్హం.ఈ విషయాలు కూడా అయినను అవహేళన చేయటానికి చెప్పలేదు విశ్వనాధ్ గారు, శోభన్ బాబు గారు ఎంత నిష్కల్మషమయిన మనిషో చెప్పటానికి చెప్పిన సరదా సంఘటన లు ఇవి. విశ్వనాధ్ గారిది, శోభన్ బాబు గారిది విడదీయరాని అనుబంధం, విశ్వనాధ్ గారికి వచ్చిన 8 నంది అవార్డులలో 5 నంది అవార్డులు శోభన్ బాబు గారి చిత్రాలకు వచ్చినవే. చెల్లెలి కాపురం చిత్రం లో అందాల నటుడిని, అందవిహీనుడిగా చూపించి మహా పాపం చేసిన వాడిని నేను అని చమత్కారంగా చెప్పుకున్నారు విశ్వనాథ్ గారు..!!